ఎట్టకేలకు మమతకు ఊరట

Supreme Court Relief For Mamata Banerjee Over Narada Case Affidavits. ఇటీవలి కాలంలో కోర్టుల్లో ఎదురు దెబ్బలు తింటూ వస్తున్న

By Medi Samrat  Published on  25 Jun 2021 5:13 PM IST
ఎట్టకేలకు మమతకు ఊరట

ఇటీవలి కాలంలో కోర్టుల్లో ఎదురు దెబ్బలు తింటూ వస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎట్టకేలకు ఓ విషయంలో మాత్రం ఊరట లభించింది. నారద టేపుల కేసులో మమత బెనర్జీకి సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. బెంగాల్ ప్రభుత్వం తరఫున సీఎం మమత, న్యాయ శాఖ మంత్రి మలాయ్ ఘటక్ లు దాఖలు చేసిన అఫిడవిట్ లను పున:పరిశీలించాల్సిందిగా కలకత్తా హైకోర్టుకు సూచించింది. జూన్ 29లోగా వారు సమర్పించిన అఫిడవిట్లను ఆమోదించాలని ఆదేశించింది.

ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అనిరుద్ధ బోస్ లు తప్పుకొన్న రెండు రోజులకే సుప్రీం కోర్టు ఈ ఆదేశాలను ఇచ్చింది. నారద టేపుల కేసుకు సంబంధించి బెంగాల్ సర్కార్ దాఖలు చేసిన అఫిడవిట్లపై జూన్ 9న కలకత్తా హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ రాజేశ్ బిందాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఆ అఫిడవిట్లను సీఎం, న్యాయ శాఖ మంత్రులు చెప్పిన సమయంలోగా దాఖలు చేయలేదని, వాటిని ఇప్పుడు తాము ఇష్టమొచ్చినప్పుడు దాఖలు చేస్తామంటే వాటిని ఆమోదించేది లేదని పేర్కొంటూ ఆ అఫిడవిట్లను తిరస్కరించడంతో మమత బెనర్జీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ అఫిడవిట్ లను పున:పరిశీలించాల్సిందిగా కలకత్తా హైకోర్టుకు సూచించింది. తర్వాతి విచారణను జూన్ 29కి వాయిదా వేశారు.




Next Story