సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కరోనా

Supreme Court judge Justice DY Chandrachud tests positive for COVID-19. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌కు కరోనా

By Medi Samrat
Published on : 13 May 2021 1:01 PM IST

DY Chandrachud

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనతోపాటు పలువురు సిబ్బందికి కూడా కరోనా సోకిందని కోర్టు వ‌ర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనీ, ఆయన నేతృత్వంలోని ధర్మాసనం కొన్ని రోజుల పాటు సమావేశం కాకపోవచ్చునని వెల్లడించాయి. ప్రస్తుతం దేశంలోని నెలకొన్న కరోనా సంక్షోభ సంబంధిత అంశాలను జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ పిటిష‌న్ల‌పై గురువారం విచార‌ణ జ‌రుగాల్సి ఉండ‌గా ఆయ‌న అందుబాటులో లేకపోవ‌డంతో మ‌రో తేదీకి వాయిదా ప‌డే సూచనలు కన్పిస్తున్నాయి.


Next Story