సుప్రీంకోర్టు కొలీజియం మరో చరిత్రాత్మక నిర్ణయం
హైకోర్టులకు 68 మంది జడ్జిలను సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
ఒకేసారి 12 హైకోర్టులకు 68 మంది జడ్జిల పేర్లు సిఫారసు
ఢిల్లీ : భారత అత్యున్నత న్యాయస్థానం మరో చారిత్ర్మక నిర్ణయం తీసుకుంది. హైకోర్టులకు 68 మంది జడ్జిల పేర్లను సిఫారసు చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని 12 హైకోర్టులకు 68 మంది జడ్జిలను సిఫారసు చేయగా.. వీరిలో 44 మంది బార్ అసోసియేషన్స్ నుంచి మరో 24 మందిని జ్యుడీషియల్ సర్వీసెస్ నుంచి ఎంపిక చేశారు.
ఆలహాబాద్, రాజస్థాన్, కలకత్తా, ఝార్ఖండ్, జమ్ముకశ్మీర్, మద్రాస్, మధ్యప్రదేశ్, కర్ణాటక, పంజాబ్ & హర్యానా, కేరళ, చత్తీస్‌ఘడ్, అసోం కోర్టులకు జడ్జిలను కొలీజియం సిఫారసు చేసింది. 68 మంది జడ్జిలలో 10 మహిళలు ఉన్నారు. గౌహతి హైకోర్టు జడ్జిగా తొలి ఎస్టీ మహిళా జ్యుడీషియల్ ఆఫీసర్ మార్లీ వన్ కుంగ్‌ను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజయం నిర్ణయం తీసుకుంది. మిజోరం నుంచి హైకోర్టు తొలి మహిళా జడ్జీ మార్లీ వన్ కుంగ్ సిఫారసు చేయబడ్డారు. ఇక సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియంలో సభ్యులుగా జస్టిస్ యు.యు.లలిత, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ ఉన్నారు.