నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ పరీక్షకు మహిళల‌కు అనుమతి..

Supreme Court allows women to appear for NDA exam. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు మహిళలకు

By Medi Samrat  Published on  18 Aug 2021 4:18 PM IST
నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ పరీక్షకు మహిళల‌కు అనుమతి..

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు మహిళలకు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాలను జారీ చేసింది. అయితే ఫలితాలు మాత్రం తుది తీర్పునకు లోబడి ఉంటాయని తెలిపింది. సెప్టెంబరు 5న జరగ‌నున్న‌ ఈ పరీక్షకు సంబంధించి.. తాజా ఆదేశాల ఉద్దేశం అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేయాలని యూపీఎస్సీని సుప్రీంకోర్టు ఆదేశించింది. తగిన విధంగా సవరణ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేయాలని తెలిపింది. ఎన్డీయే పరీక్షకు హాజరయ్యేందుకు మహిళలను అనుమతించాలని కోరుతూ కుశ్‌ కల్రా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జ‌రిగింది. ఈ సందర్భంగా జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హృషీకేశ్‌ రాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తాత్కాలిక ఆదేశాలను జారీ చేసింది.

పిటిషనర్‌ తరపున సీనియర్‌ అడ్వకేట్‌ చిన్మయ్‌ ప్రదీప్‌ శర్మ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్‌ను ప్రస్తావించారు. ఎన్డీయేకు మహిళలను అనుమతించే విషయం పూర్తిగా విధానపరమైన నిర్ణయమని, దీనిలో కోర్టులు జోక్యం చేసుకోరాదని, ఈ పరీక్షకు మహిళలను అనుమతించకపోవడం వల్ల వారి ప్రగతికి, కెరీర్‌కు ఇబ్బందులేవీ ఉండబోవని కేంద్ర ప్రభుత్వం చెప్తోందన్నారు. మహిళల పట్ల ఎక్కడా వివక్ష చూపించట్లేదని కేంద్రం వాదించింది. సాయుధ దళాల్లోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపింది. వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించట్లేదని స్పష్టం చేసింది.

మీ ఆలోచనా విధానమే అసలు సమస్య. ప్రభుత్వం వెంటనే దానిని మార్చుకుంటే మంచిది. మేం ఆదేశాలిచ్చే వరకు తెచ్చుకోవద్దు'' అని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. సైన్యంలోనూ మహిళలకు సమాన అవకాశాలను కల్పించాల్సిందేనని, ఇప్పుడున్న పరిస్థితిని వెంటనే మార్చాలని ఆదేశించింది. అవకాశాలను కల్పించాలని జస్టిస్ చంద్రచూడ్ తీర్పునిచ్చినా అమలు చేయరా? అని జస్టిస్ కౌల్ ప్రశ్నించారు. ఆర్మీలో మహిళలకు అవకాశాల కోసం పర్మనెంట్ కమిషన్ వేయాలన్న జస్టిస్ ఆదేశాలను అమలు చేయరా? అంటూ నిలదీశారు.





Next Story