నిత్యం న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది, ప్రతివాదులు, ఫిర్యాదుదారులో బీజీగా ఉండే బాంబే హైకోర్టులో పాము కలకలం రేపింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌ఆర్ బోర్కర్ ఛాంబర్‌లో శుక్రవారం ఉదయం పాము కనిపించింది. కోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 4.5 నుండి 5 అడుగుల పొడవు, విషం లేని పాము, తెల్లవారుజామున న్యాయమూర్తి తన ఛాంబర్‌లో లేని సమయంలో కనబడింది. పామును జెర్రిగొడ్డుగా గుర్తించిన తర్వాత, న్యాయమూర్తుల సిబ్బంది హెచ్‌సి ప్రాంగణంలోని పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు, వారు ఎన్‌జిఓ - సర్ప్‌మిత్ర (పాములు పట్టే వారిని) సంప్రదించారు. వారి స్వచ్ఛంద సంస్థ స్వచ్ఛంద సేవకుల్లో ఒకరు పామును పట్టుకున్నారు. పామును అడవుల్లో వదిలేస్తామని ఒక అధికారి తెలిపారు. కాగా ప్రస్తుతం జడ్జి ఛాంబర్‌లోకి చొరబడిన పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.