కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కోలార్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం
సిద్ధరామయ్య మంగళవారం ప్రకటించారు. 2018 ఎన్నికల్లో చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి గెలుస్తానన్న నమ్మకం లేకపోవడంతో బాదామి, చాముండేశ్వరి అనే రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశాను. ఈసారి నేను వరుణ నియోజకవర్గం నుంచి గెలుస్తానన్న నమ్మకం ఉంది. కానీ కోలార్ ప్రజలు నాపై ప్రేమ చూపి అక్కడి నుంచి కూడా పోటీకి దిగాలని కోరారు. అందుకే కోలార్ నుంచి కూడా టిక్కెట్ ఇవ్వాలని హైకమాండ్‌ని కోరాను అని మైసూరులో చెప్పారు. మే 10న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికల పోరు అని సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. సిద్దరామయ్య కర్ణాటక రాజకీయలలో పరిచయం అవసరం లేని పేరు. ఆయన రాష్ట్రానికి 22వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
సిద్దరామయ్య వయసు (74) రీత్యా ఈ ప్రకటన చేసుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.