ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కర్నాటక కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత పోరును తొలగించే ప్రయత్నంలో ఉన్నారు పార్టీ నేతలు. అత్యున్నత పదవి అయిన ముఖ్యమంత్రి పదవి కోసం ఆశపడటంలో తప్పేమీ లేదని లోపి మాజీ సీఎం సిద్ధరామయ్య శుక్రవారం అన్నారు. మేమందరం ఆశావహులమే కానీ మేము కొట్లాడుకోవడం లేదు. డికె శివకుమార్ (పీసీసీ అధ్యక్షుడు) కూడా ఆశావహులలో ఒకరు, నేను కూడా ఆశావహులలో ఒకడిని.. జి పరమేశ్వర కూడా ఆశావహుడే. ఇందులో తప్పు లేదని సిద్ధరామయ్య అన్నారు.
ఈ ఏడాది కర్నాటక ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో జేడీఎస్ తర్వాత కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీ. సీఎం పదవికి సిద్ధరామయ్య, శివకుమార్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ 'ప్రజాధ్వని యాత్ర'లో భాగంగా సిద్ధరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ వేర్వేరుగా బస్సు యాత్ర చేశారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించగా, దక్షిణాది జిల్లాల్లో శివకుమార్ పర్యటించారు. కాంగ్రెస్ జనవరి 11న మొదటి దశ 'ప్రజాధ్వని యాత్ర'ని బెలగావి నుండి ప్రారంభించింది. జనవరి 29 వరకు జరిగిన ఈ యాత్రలో పాల్గొన్న శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరు నేతలు.. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.