మనోహర్ పారికర్ కుమారుడికి మ‌ద్ద‌తుగా బీజేపీయేతర పార్టీలు కలిసి రావాలి

Shiv Sena, AAP make overtures to Manohar Parrikar's son ahead of Goa polls. గోవా అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉన్నందున మాజీ

By Medi Samrat  Published on  17 Jan 2022 4:28 PM GMT
మనోహర్ పారికర్ కుమారుడికి మ‌ద్ద‌తుగా బీజేపీయేతర పార్టీలు కలిసి రావాలి

గోవా అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉన్నందున మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్‌కు మద్దతుగా బీజేపీయేతర పార్టీలు కలిసి రావాలని శివసేన సోమవారం కోరింది. ఉత్పల్ పారికర్ బీజేపీని వీడాల‌నుకుంటే.. తమ పార్టీ స్వాగతిస్తుంద‌ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన ఒక రోజులోపే ఈ పరిణామం చోటు చేసుకుంది. "ఉత్పల్ పారికర్ పనాజీ స్థానం నుండి స్వతంత్రంగా పోటీ చేస్తే.. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, గోవా ఫార్వర్డ్ పార్టీలతో సహా అన్ని బీజేపీయేతర పార్టీలు అతని అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని.. అతనిపై అభ్యర్థిని నిలబెట్టవద్దని నేను ప్రతిపాదిస్తున్నాను. ఇది మనోహర్ భాయ్ కు నిజమైన నివాళి..! అని శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.

1994 నుండి తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పనాజీ అసెంబ్లీ టికెట్ కోసం ఉత్పల్ పారికర్ ప్రయత్నిస్తున్నారు. అయితే బిజెపి ఆయనను పక్కన పెట్టింది. దీంతో ఉత్పల్ పారికర్ బీజేపీతో విభేదించారు. గోవా అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇంఛార్జ్‌గా దేవేంద్ర ఫడ్నవీస్ ఉండ‌గా.. తన తండ్రి గుర్తింపు.. ఒక రాజకీయ నాయకుడి టిక్కెట్టు డిమాండ్‌కు ఆధారం కాదని అన్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. పార్టీ కేంద్ర నాయకత్వం పారికర్‌తో టచ్‌లో ఉందని.. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని సూచించారు. "ఉత్పల్ పంజిమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. మా కేంద్ర నాయకత్వానికి దాని గురించి పూర్తిగా తెలుసు. వారు ఉత్పల్‌తో టచ్‌లో ఉన్నారు. వారు ఈ విష‌య‌మై ఒక పరిష్కారం కనుగొంటారు" అని చెప్పారు.


Next Story