వ్యాపారవేత్త మరియు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల రాకెట్ కేసులో ప్రమేయం ఉన్నారనే ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 63 రోజులు జైలులో గడిపిన తర్వాత ఆర్థర్ రోడ్ జైలు నుండి విడుదలయ్యాడు. రాజ్ కుంద్రా బయటకు వచ్చాక పోర్న్ రాకెట్ కేసు గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. తాజాగా మాత్రం తన ట్విట్టర్ ఖాతాలో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. తాను నిర్దోషినని పేర్కొన్న కుంద్రా.. ముంబై క్రైమ్ బ్రాంచ్ సీనియర్ అధికారులు తనను ఇరికించారని లేఖలో ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తనపై అభియోగాలు మోపిన యాప్ తన బావదని, అందులో నీలిచిత్రాలు లేవని లేఖలో పేర్కొన్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్‌లోని కొందరు అధికారులు తనను ఇరికించేందుకు ఇదంతా చేశారని, తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ప్రతిసాక్షిపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అలాగే తనకు న్యాయం చేయాలంటూ రాజ్‌కుంద్రా ప్రధాని కార్యాలయానికి సైతం లేఖ రాశారు. నీలి చిత్రాలు తీయడం, ఇందుకు సంబంధించిన నిందితుల్లో ఎవరితోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని కుంద్రా పేర్కొన్నారు. "నేను ఒక సంవత్సరం పాటు మౌనంగా జీవించాను. ఆర్థర్ రోడ్ జైలులో 63 రోజులు గడిపారు. నేను న్యాయస్థానాల నుండి న్యాయం కోరుతున్నాను, అది నాకు లభిస్తుందని నాకు తెలుసు. ఈ అధికారులపై విచారణ జరిపించాలని నేను అభ్యర్థిస్తున్నాను." అని రాజ్ కుంద్రా లేఖలో చెప్పుకొచ్చారు.