మోదీతో శరద్ పవార్ భేటీ
Sharad Pawar meets PM Modi in Delhi for nearly an hour. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని మోదీ
By Medi Samrat Published on 17 July 2021 9:40 AM GMTభారత ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని మోదీ నివాసానికి శరద్ పవార్ వెళ్లారు. వీరిద్దరి సమావేశం దాదాపు 50 నిమిషాల సేపు కొనసాగిందని నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. శరద్ పవార్, మోదీ మాట్లాడుకుంటున్న ఫోటోను ప్రధానమంత్రి కార్యాలయం తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. వర్షాకాల సమావేశాలు 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఇద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Rajya Sabha MP Shri Sharad Pawar met PM @narendramodi. @PawarSpeaks pic.twitter.com/INj26CLl0k
— PMO India (@PMOIndia) July 17, 2021
రాష్ట్రపతి పదవి కోసం శరద్ పవార్ పోటీలో ఉన్నట్లు ఇటీవల వార్తలు రాగా ఈ వార్తలను ఆయన ఖండించారు. తాను రాష్ట్రపతి ఎన్నికల్లో నిలవడంలేదని పవార్ అన్నారు. శరద్ పవార్ వయసు 80 ఏళ్లు. 2024లో జరగబోయే ఎన్నికల గురించి ఇప్పుడే చెప్పలేమని.. రాజకీయ పరిస్థితులు ఎప్పుడూ మారుతుంటాయని ఆయన ఇటీవల తెలిపారు. భారత రాష్ట్రపతి రేసులో శరద్ పవార్ ఉండబోతున్నారని ఆయనకు దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమైన సంగతి తెలిసిందే.
ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ఎన్సీపీ అధికారాన్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంపై ఈ భేటీ ఏ మేరకు ప్రభావాన్ని చూపబోతోందనే విషయం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా శరద్ పవార్ మోదీతో భేటీ అవ్వడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.