తీవ్ర వాదుల దగ్గర వయాగ్రా..!
Sexual Exploitation Of Women In Name Of Jihad. జమ్ము కశ్మీర్‌లో ఆగస్ట్ 6న భద్రతా దళాల చేతిలో హతమైన ఇద్దరు ఉగ్రవాదుల నుంచి అధికారులు పలు
By Medi Samrat
జమ్ము కశ్మీర్‌లో ఆగస్ట్ 6న భద్రతా దళాల చేతిలో హతమైన ఇద్దరు ఉగ్రవాదుల నుంచి అధికారులు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో రైఫిళ్లు, ఆయుధాలు మాత్రమే కాదు వయాగ్ర ట్యాబ్లెట్లు కూడా ఉన్నాయి. రాజౌరి జిల్లా తనమండి ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. చనిపోయిన ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్తాన్ జాతీయుడని, ఇటీవలే భారత్‌లోకి అతడు అక్రమంగా చొరబడ్డాడని భద్రతా దళాలు గుర్తించాయి. తనమండి ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకుని కాల్పులు జరిపాయి. ఉగ్రవాదులు ప్రతిగా కాల్పులు జరపడంతో కొద్దిగంటల సేపు ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.
ఈరోజు అస్సాం రైఫిల్స్ విభాగం, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో మయన్మార్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ వర్గాల ఆధారంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. స్వాధీనం చేసుకున్న మందుగుండు సామగ్రిలో రెండు ఏకే-47 రైఫిల్స్, రెండు ఎం16 రైఫిల్స్, మూడు 9 ఎంఎం పిస్టల్స్, ఒక చైనీస్ మేడ్ గ్రెనేడ్, ఏకే-56, ఎం-16 తొమ్మిది మ్యాగజైన్లు, 9 ఎంఎం పిస్టల్‌తో పాటు నాలుగు మ్యాగజైన్‌లు, 361 లైవ్ రౌండ్లు ఉన్నాయి. మణిపూర్ పోలీసులు, అసోం రైఫిల్స్ సంయుక్త బృందం మోరే పట్టణం, ఎస్ మోల్జోల్ గ్రామంలోని ఒక వ్యక్తికి చెందిన ఇంట్లో సోదాలు నిర్వహించి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. అరెస్టులు చేయలేదని అధికారులు తెలిపారు.