అమెరికాలో జైశంకర్-పీయూష్ గోయల్.. వాటిపైనే కీల‌క చ‌ర్చ‌లు..!

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.

By -  Medi Samrat
Published on : 22 Sept 2025 9:09 AM IST

అమెరికాలో జైశంకర్-పీయూష్ గోయల్.. వాటిపైనే కీల‌క చ‌ర్చ‌లు..!

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయనతో పాటు పీయూష్ గోయల్ కూడా అమెరికా చేరుకున్నారు. భారత్‌పై 50 శాతం సుంకం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్న తర్వాత జైశంకర్ అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈరోజు అమెరికా కౌంటర్ మార్కో రూబియోతో సమావేశం కానున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఇరువురు నేతల భేటీ జరగనుంది.

భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న తరుణంలో వీరిద్దరి మధ్య ఈ భేటీ జరుగుతోంది. ఇరువురు నేతల భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యానికి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

అదే సమయంలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయ‌న‌ వాషింగ్టన్ DCలో తన సహచరులతో క‌లిసి అక్కడ చర్చలు జరుపుతారు. తద్వారా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే అవ‌కాశం ఉంది. పీయూష్ గోయల్ తన పర్యటనలో న్యూయార్క్‌లో USTR జేమ్సన్ గ్రీర్‌ను కూడా కలవనున్నారు. ఈ ఏడాది అమెరికా, భారత్‌ల విదేశాంగ మంత్రులు ముఖాముఖి సమావేశమ‌వడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

Next Story