ఏడు రోజుల్లో ఆ మృతదేహాలకు దహన సంస్కారాలు పూర్తిచేయండి : సుప్రీం
మణిపూర్‌లోని మార్చురీలలో పడి ఉన్న మృతదేహాలను ఖననం లేదా దహన సంస్కారాలు నిర్వహించాలని
By Medi Samrat Published on 28 Nov 2023 1:50 PM GMTమణిపూర్‌లోని మార్చురీలలో పడి ఉన్న మృతదేహాలను ఖననం లేదా దహన సంస్కారాలు నిర్వహించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. మే నెలలో రాష్ట్రంలో కుల హింస చెలరేగడంతో చాలా మంది చనిపోయారు. రాష్ట్రంలోని మార్చురీలలో పడి ఉన్న మృతదేహాల పరిస్థితిని సూచిస్తూ.. సుప్రీంకోర్టు నియమించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తుల మహిళా కమిటీ నివేదికను దాఖలు చేసిందని చీఫ్ జస్టిస్ (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ కమిటీకి జస్టిస్ (రిటైర్డ్) గీతా మిట్టల్ నేతృత్వం వహించారు.
169 మృతదేహాలలో 81 మృతదేహాలను వారి బంధువులు క్లెయిమ్ చేయగా.. 88 మృతదేహాలను క్లెయిమ్ చేయలేదని పేర్కొంది. మృతదేహాలను ఖననం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది స్థలాలను గుర్తించిందని ధర్మాసనం పేర్కొంది. 'గుర్తించబడని లేదా క్లెయిమ్ చేయని ఆ మృతదేహాలను నిరవధికంగా మార్చురీల్లో ఉంచడం సరికాదు' అని ధర్మాసనం పేర్కొంది.
మంగళవారం నాటి విచారణ సందర్భంగా.. మృతుల కుటుంబ సభ్యులు ఎటువంటి ఆటంకాలు లేకుండా తొమ్మిది ప్రదేశాలలో మృతదేహాలను దహనం చేయవచ్చని ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటికే క్లెయిమ్ చేసిన మృతదేహాలను వివరాలను, స్థలాలను అధికారులు బంధువులకు తెలియజేస్తారని పేర్కొంది. డిసెంబర్ 4వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ధర్మాసనం పేర్కొంది. చివరి కర్మలు. శాంతిభద్రతల పరిరక్షణకు, అంత్యక్రియలు సక్రమంగా జరిగేలా చూసేందుకు కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)కి అన్ని రకాల చర్యలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.