2000 నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోటును ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  30 Sep 2023 2:00 PM GMT
2000 నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోటును ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ గడువు కాస్తా నేటితో ముగియనుండటంతో మరో వారం రోజులు గడువు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఆర్బీఐ 2016 సంవత్సరం నవంబర్ 8వ తేదీన 2000 రూపాయల నోటును ప్రవేశపెట్టింది. 2023 మార్చ్ 19వ తేదీన 2000 రూపాయల నోటును తిరిగి ఉపసంహరిస్తూ ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. మార్చుకునేందుకు కొన్ని నెలల గడువిచ్చింది. ఆ గడువు కాస్తా సెప్టెంబర్ 30తో ముగుస్తోంది. దాంతో ఆర్బీఐ 2000 రూపాయల నోటు మార్చుకునేందుకు గడువు పొడిగించింది. అక్టోబర్ 7 వరకూ పొడిగించింది.

కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు మే 19న సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 29 నాటికి రూ.3.42 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లను సేకరించినట్లు ఆర్బీఐ తెలిపింది. ఇంకా 0.14 లక్షల కోట్ల విలువైన 2000 డినామినేషన్ నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయని తెలిపింది. మార్కెట్లో నుంచి రూ. 2000 నోట్లు ఇంకా బ్యాంకుల్లోకి పూర్తిగా తిరిగి రాకపోవడంతో నోట్లను మార్చుకోడానికి మరికొంత గడవు పొడిగించాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాత 1000, 500 రూపాయల నోట్ల రద్దు తర్వాత 2016 నవంబర్ లో 2,000 రూపాయల కరెన్సీ నోటును భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇతర డినామినేషన్లలో కరెన్సీ తగిన పరిమాణంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టిన లక్ష్యం నెరవేరిందని ఆర్బీఐ తెలిపింది.

Next Story