రైతులకు RBI గుడ్‌న్యూస్‌.. UPI ద్వారా ఎలాంటి తనఖా లేకుండా రూ.2 లక్షల రుణాలు

ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వ్యవసాయ ఖర్చుల దృష్ట్యా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చిన్న రైతులకు తనఖా లేకుండా ఇచ్చే రుణాల పరిమితిని పెంచాలని నిర్ణయించింది.

By Medi Samrat  Published on  6 Dec 2024 8:45 PM IST
రైతులకు RBI గుడ్‌న్యూస్‌.. UPI ద్వారా ఎలాంటి తనఖా లేకుండా రూ.2 లక్షల రుణాలు

ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వ్యవసాయ ఖర్చుల దృష్ట్యా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చిన్న రైతులకు తనఖా లేకుండా ఇచ్చే రుణాల పరిమితిని పెంచాలని నిర్ణయించింది. ఇకపై చిన్న రైతులు ఎలాంటి తనఖా లేకుండా రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకోవచ్చని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం ఈ పరిమితి 1.6 లక్షలు. కొత్త సంవత్సరం నుంచి అన్ని బ్యాంకులు ఆర్‌బీఐ సూచనలను పాటించాల్సి ఉంటుంది.

ఇప్పుడు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFBలు) UPI ద్వారా రుణాలు ఇవ్వగలవు. దీని ప్రయోజనం ఏమిటంటే, గ్రామాల్లో కూడా గ్రామస్తులు UPI ద్వారా సులభంగా రుణాలు పొందగలుగుతారు. గ్రామాల్లో ఎస్‌ఎఫ్‌బీలు ఎక్కువగా ఉన్నాయి. SFBకి ఇంకా ఈ సదుపాయం లేదు.. ఇప్పుడు అందుబాటులోకి రానుంది. RBI ప్రకారం.. 2019 సంవత్సరం నుండి రైతులకు తనఖా లేకుండా ఇచ్చే రుణ పరిమితి రూ. 1.6 లక్షలు కాగా.. అంతకు ముందు ఈ పరిమితి రూ.లక్ష ఉండేది.

కోట్లాది మంది రైతుల ప్రయోజనాలకు సంబంధించి RBI తీసుకున్న ఈ నిర్ణయం కూడా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో GDP వృద్ధి రేటును బలోపేతం చేయడానికి, వ్యవసాయం మెరుగ్గా ఉండాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వ్యవసాయ రంగంలో 3.5 శాతం వృద్ధి నమోదు కాగా.. తయారీ రంగం వృద్ధి రేటు రెండు శాతంగా ఉంది. గ్రామీణ డిమాండ్ మంచి పంటపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. గ్రామీణ డిమాండ్ పెరుగుదలతో మాత్రమే మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో GDP బలాన్ని ఆశించవచ్చు.

Next Story