క్రెడిట్ కార్డుల విషయంలో కొత్త రూల్స్ తీసుకుని వచ్చిన రిజర్వ్ బ్యాంకు

RBI announces new rules for credit, debit cards. క్రెడిట్​, డెబిట్​ కార్డుల మోసాలు, ఛార్జీల విషయంలో రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా

By Medi Samrat  Published on  24 April 2022 8:51 AM GMT
క్రెడిట్ కార్డుల విషయంలో కొత్త రూల్స్ తీసుకుని వచ్చిన రిజర్వ్ బ్యాంకు

క్రెడిట్​, డెబిట్​ కార్డుల మోసాలు, ఛార్జీల విషయంలో రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(RBI) కొత్త మార్గదర్శకాలను తీసుకువస్తోంది.కార్డుల జారీపై కొత్త మార్గదర్శకాలను 2022 జులై 1 నుంచి అమలు చేయనుండగా.. ఈ నిబంధనలతో వినియోగదారులకు రక్షణతో పాటు సేవల్లో పారదర్శకత పెరుగుతుందని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం క్రెడిట్​ కార్డు క్లోజ్ చేయాలని కస్టమర్ నుంచి విజ్ఞప్తి వస్తే దానిని వారం రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి.. కస్టమర్ కు వెంటనే ఈ-మెయిల్​, మెసేజ్​ ద్వారా సమాచారం అందించాలి. సమస్యల పరిష్కారానికి ప్రత్యేకమైన మెయిల్​ ఐడీతో పాటు, ఐవీఆర్​ సేవలను ఉపయోగించాలి. వాటి వివరాలు ఇంటర్నెట్​ బ్యాంకింగ్​, వెబ్​సైట్​లలో ప్రత్యేకంగా కనిపించేలా ఏర్పాటు చేయాలి.

క్రెడిట్ కార్డ్ క్రోజింగ్ రిక్వెస్ట్ ను సకాలంలో పూర్తి చేయకపోతే.. ఆలస్యం చేసిన ప్రతిరోజుకు రూ.500 చొప్పున కస్టమర్​కు బ్యాంకు జరిమానా చెల్లించాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం పాటు క్రెడిట్ కార్డును వినియోగించకుంటే.. కార్డు యజమానికి సమాచారం అందించిన తర్వాతే ఖాతాను మూసివేయాల్సి ఉంటుంది. 30 రోజుల వ్యవధిలోపు కార్డ్ యజమాని నుంచి ఎటువంటి సమాధానం రాకపోతే.. బకాయిల చెల్లింపునకు లోబడే ఖాతాను మూసివేయాలి. 30 రోజుల వ్యవధిలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీతో కార్డ్ మూసివేత రికార్డును అప్‌డేట్ చేయాలి. క్రెడిట్ కార్డ్ ఖాతా మూసివేసిన తర్వాత.. ఖాతాలో ఏదైనా క్రెడిట్ కార్డు నగదు ఉంటే దానిని యజమాని బ్యాంక్ ఖాతాకు ట్రాన్ఫర్ చేయాలి. క్రెడిట్​ కార్డు ఛార్జీలలో మార్పులు ఉంటే వాటి అమలుకు 30 రోజుల ముందే కస్టమర్లకు తెలపాలి. సేవింగ్స్​, కరెంట్​ అకౌంట్ ఉన్న కస్టమర్లకు మాత్రమే డెబిట్ కార్డులు జారీ చేయాలి. లోన్ అకౌంట్ ఖాతాదారులకు డెబిట్​ కార్డులు జారీ చేయకూడదు.

Next Story