బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉందని.. ఇలా చేస్తారా..?

Rajasthan Couple Targetted by Goons in Bharatpur, Girl Thrashed And Abused. భరత్ పూర్ జిల్లాలో బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ కనిపించిందనే కారణంతో ఓ యువతి పట్ల గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారు.

By Medi Samrat  Published on  15 March 2021 7:49 AM GMT
Rajasthan Couple Targetted by Goons in Bharatpur,

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడ్డ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ లో చోటు చేసుకుంది. ఓ యువతి పట్ల గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారు. ఇంతకూ ఆమె చేసిన తప్పేమిటో తెలుసా..? కేవలం బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉండడమే..! భరత్ పూర్ జిల్లాలో బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ కనిపించిందనే కారణంతో ఓ యువతి పట్ల గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారు. అబ్బాయితో మాట్లాడతావా అంటూ గ్రామస్థులే ఆమెపై దాడి చేశారు.

భరత్ నగర్ కి చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి ఒక షాపు ముందు కూర్చొని మాట్లాడుతూ. దీన్ని చూసిన స్థానికులు ఆగ్రహంతో ఆమెను చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను పోలీసులు పరిశీలించారని తెలుస్తోంది. ఇప్పటి వరకు వారిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలుస్తోంది.

మొదట అక్కడి వ్యక్తులు వారిద్దరిపై దాడి చేయడం మొదలుపెట్టారు.. ఆమెను అతడిని కిందపడేసి కొట్టడం మొదలుపెట్టారు. వెంటనే ఆ యువకుడు అక్కడి నుండి తప్పించుకోగా.. ఆమె మాత్రం స్థానికుల చేతుల్లో దెబ్బలు తిన్నది. రక్షించండి అంటూ ఆమె మొరపెట్టుకున్నా కూడా ఎవరూ రక్షించడానికి రాలేదు. దుపట్టా పట్టుకుని లాగి మరీ కొట్టారు. ఈ ఘటన చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది.



Next Story