లంపీ స్కిన్ డిసీజ్ అన్నది ఉత్తరభారతదేశంలో పెద్ద ఎత్తున ప్రబలుతోంది. ఎన్నో ఆవులు మృత్యువాత పడుతూ ఉన్నాయి. ఈ విషయంపై చర్చ జరిపేందుకు బీజేపీ ఎమ్మెల్యే సురేష్ సింగ్ రావత్ సోమవారం రాజస్థాన్ అసెంబ్లీకి ఆవుతో వచ్చారు. అయితే మంత్రి సభా ప్రాంగణానికి చేరుకునేలోపే ఆవు పారిపోయింది. అసెంబ్లీ గేటు వెలుపల రావత్ మీడియాతో మాట్లాడుతుండగా.. ఆవు అక్కడి నుంచి పారిపోయింది.
కాంగ్రెస్‌కు చెందిన గోవింద్ సింగ్ దోతస్రాపై రావత్ స్పందిస్తూ, "ఈ ప్రభుత్వంపై ఆవు కూడా కోపంగా ఉంది" అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే చేతిలో కర్ర పట్టుకుని విలేఖరులతో మాట్లాడుతూ.. ఆవులు లంపీ స్కిన్ డిసీజ్ తో బాధపడుతున్నాయని, అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గాఢ నిద్రలో ఉందన్నారు. ప్రభుత్వాన్ని మేల్కొలపడానికి విధానసభ కి ఒక ఆవును తీసుకువచ్చానని రావత్ చెప్పారు. సోమవారం పశుసంవర్ధక శాఖ గణాంకాల ప్రకారం, 59,027 పశువులు ఈ వ్యాధి కారణంగా చనిపోగా, 13,02,907 ప్రభావితమయ్యాయి.