రజనీ హెల్త్‌ బులెటిన్ విడుదల.. మధ్యాహ్నం తర్వాతే డిశ్చార్జ్‌పై క్లారిటీ

Rajanikanth Latest Health Bulletin. తమిళ సూపర్ స్టార్, త‌లైవా రజనీకాంత్ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలోనే ఉన్నారు.

By Medi Samrat  Published on  27 Dec 2020 11:42 AM IST
రజనీ హెల్త్‌ బులెటిన్ విడుదల.. మధ్యాహ్నం తర్వాతే డిశ్చార్జ్‌పై క్లారిటీ

తమిళ సూపర్ స్టార్, త‌లైవా రజనీకాంత్ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలోనే ఉన్నారు. అస్వస్థతకు గురైన రజనీ.. శుక్రవారం ఉదయం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. హైబీపీ(అధిక‌ ర‌క్త పోటు) కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆయనకు అన్ని వైద్య పరీక్షలు చేశారు డాక్టర్లు. ఇక, రజనీ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

రజనీకి చేసిన వైద్య పరీక్షలన్నీ నార్మల్ గానే ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొన్న డాక్టర్లు.. ఇవాళ మధ్యాహ్నం మరోసారి రజనీని వైద్యుల బృందం పరిశీలించనున్నట్టు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరీశీలించిన తర్వాతే డిశ్చార్జ్ చేయనున్నట్టు బులెటిన్‌లో పేర్కొన్నారు. కాగా. మరోవైపు ఇవాళే రజనీకాంత్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో రజనీ.. హైదరాబాద్‌ నుంచి చెన్నైకి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. దీనిపై ఇవాళ మధ్యాహ్నం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇదిలావుంటే.. రజనీకాంత్‌ ఆరోగ్యపరిస్థితి తెలుసుకున్న ఆయన కుమార్తె ఐశ్యర్య హుటాహుటిన హైదరాబాద్‌ చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడారు. అయితే సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నందున కుమార్తె ఐశ్వర్యను కూడా రూమ్‌లో ఉండొద్దని రజనీకాంత్ చెప్పినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ గవర్నర్ తమిళి సై, త‌మిళ సినీ ప్ర‌ముఖుల‌తో పాటు.. టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు చిరంజీవి, మోహన్‌బాబు.. రజనీకాంత్ ఆరోగ్యంపై ఆరా తీశారు. వైద్యులకు ఫోన్‌ చేసి హెల్త్‌ కండీషన్‌ తెలుసుకున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సూపర్‌ స్టార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇదిలావుంటే.. 'అన్నాత్తే' సినిమా షూటింగ్‌ నిమిత్తం ఆయన ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారు. హైద‌రాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఘాటింగ్ జ‌రుగుతుండ‌గా.. చిత్ర యూనిట్‌లో ఎనిమిది మందికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో చిత్ర షూటింగ్ ను వాయిదా వేశారు. వెంట‌నే ర‌జినీకాంత్ కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. సంక్రాంతి క‌ల్లా 'అన్నాత్తే' సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి.. రాజ‌కీయాల్లో బిజీ కావాల‌నుకున్న ర‌జ‌నీకాంత్ అనుకోకుండా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈ విష‌యం తెలిసిన ఆయ‌న అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.




Next Story