గోవాకు చేరిన ఎమ్మెల్యేలు.. రాజ్ థాకరే ఎవరి సైడ్ అంటే..!

Raj Thackeray's assurance of support to BJP. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు.. తిరుగుబాటు నేత

By Medi Samrat  Published on  29 Jun 2022 3:24 PM GMT
గోవాకు చేరిన ఎమ్మెల్యేలు.. రాజ్ థాకరే ఎవరి సైడ్ అంటే..!

మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు.. తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో అసోంలోని గువాహటి నుంచి గోవాకు చేరుకున్నారు. గురువారం మహారాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని సీఎం ఉద్ధవ్ ను ఆ రాష్ట్ర గవర్నర్ ఆదేశించిన నేపథ్యంలో మహారాష్ట్రకు రావడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తూ ఉన్నారు. షిండే వర్గం లోని ఎమ్మెల్యేలంతా నేరుగా ముంబైకి వెళ్లకుండా సమీపంలోని గోవాకు చేరుకున్నారు. గురువారం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయానికి ముంబైకి చేరుకునే అవకాశముంది. ఎమ్మెల్యేలంతా మీడియా ఎదుట పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ''ఛత్రపతి శివాజీ మహరాజ్ కీ జై, ఏక్ నాథ్ షిండే సాహెబ్ మీరు ముందు వెళ్లండి.. మేమంతా మీ వెంట ఉన్నాం.." అని నినాదాలు చేశారు.

ఉద్ధ‌వ్ థాక‌రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంపై ప్ర‌వేశ‌పెట్ట‌నున్న అవిశ్వాస తీర్మానానికి మ‌హారాష్ట్ర న‌వ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్‌) మ‌ద్ద‌తు ప‌లికింది. ఈ మేర‌కు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక‌రే బుధ‌వారం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. బీజేపీ, షిండే వ‌ర్గాల‌తో కూడిన కూటమికి ఆయ‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. గురువారం మ‌హారాష్ట్ర అసెంబ్లీ ప్ర‌త్యేకంగా స‌మావేశం కానుండగా.. షిండే వ‌ర్గం ఎమ్మెల్యేల‌తో క‌లుపుకుంటే బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. మరోవైపు మ‌హారాష్ట్ర అసెంబ్లీలో విప‌క్ష నేత‌గా ఉన్న మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ బుధ‌వారం రాజ్ థాక‌రేకు ఫోన్ చేసి మ‌ద్ద‌తు కోరారు. త‌న పార్టీకి అసెంబ్లీలో ఉన్న ఏకైక అభ్య‌ర్థి బీజేపీ, షిండే వ‌ర్గం కూట‌మికే మ‌ద్ద‌తు తెలుపుతారంటూ రాజ్ థాక‌రే ప్ర‌క‌టించారు.










Next Story