Rain Alert : భారీ వ‌ర్ష హెచ్చ‌రిక‌

Rain Alert For Delhi. రానున్న కొద్ది గంటల్లో ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

By Medi Samrat  Published on  31 March 2023 2:16 PM GMT
Rain Alert : భారీ వ‌ర్ష హెచ్చ‌రిక‌

రానున్న కొద్ది గంటల్లో ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాజధానితోపాటు చుట్టుపక్కల నగరాల్లో సాయంత్రానికి ఉరుములు, మెరుపులతో కూడిన‌ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో గత రెండు రోజులుగా (బుధ, గురువారాలు) ఉరుములతో కూడిన వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం స్పష్టంగా ఉన్నప్పటికీ.. తేలికపాటి మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేప‌థ్యంలో వాతావరణ శాఖ శుక్రవారం సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

IMD ప్రకారం, ఢిల్లీలోని (ముండ్కా, పశ్చిమ్ విహార్, రాజౌరీ గార్డెన్, జాఫర్‌పూర్, నజఫ్‌గఢ్, ద్వారకా, పాలం, ఐజిఐ విమానాశ్రయం) ప‌రిస‌ర‌ ప్రదేశాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు మరియు ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని పేర్కొంది. ఈ మేర‌కు భారత వాతావరణ శాఖ ట్వీట్ చేసింది.


Next Story