కేటీఎం బైక్‌పై రాహుల్ గాంధీ రైడ్.. ఎక్క‌డికి వెళ్లారంటే..

ఆగస్టు 20న తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి కావడంతో.. ఆయన

By Medi Samrat
Published on : 19 Aug 2023 4:42 PM IST

కేటీఎం బైక్‌పై రాహుల్ గాంధీ రైడ్.. ఎక్క‌డికి వెళ్లారంటే..

ఆగస్టు 20న తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి కావడంతో.. ఆయన జన్మదిన వేడుకలను జరుపుకోడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం లడఖ్‌లోని పాంగోంగ్ సరస్సు వద్దకు బైక్‌పై వెళ్లారు. రాహుల్ గాంధీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఫోటోలను పంచుకున్నారు. ఇతర రైడర్‌లు అతనిని అనుసరిస్తూ వచ్చారు. రాహుల్ గాంధీ KTM 390 అడ్వెంచర్‌ బైక్ ను నడిపాడు. హెల్మెట్, గ్లోవ్స్, రైడింగ్ బూట్లు, జాకెట్‌తో సహా పూర్తి బైకింగ్ గేర్‌లో లడఖ్‌ లో తిరుగుతూ కనిపించారు. రాహుల్ గాంధీ లడఖ్ పర్యటన ఆగస్టు 25 వరకు కొనసాగుతుంది.

లడఖ్‌ లో పర్యటిస్తున్న ఎంపీ రాహుల్‌ గాంధీ శనివారం పాంగాంగ్ సరస్సుకు బైక్ నడుపుకుంటూ వెళ్లారు. భారత్‌-చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్‌ సరస్సుకు ప్రయాణానికి ముందు రాహుల్‌ మాట్లాడుతూ.. ‘ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్‌ సరస్సు ఒకటి అని మా నాన్న చెప్పేవారు’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాహుల్ గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ ఫోటోలను షేర్ చేసింది.

Next Story