19 ఏళ్ల తర్వాత ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi vacates govt-allotted bungalow. పరువు నష్టం కేసులో దోషిగా తేలి, ఎంపీగా అనర్హత వేటు పడిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు.

By Medi Samrat  Published on  22 April 2023 12:53 PM GMT
19 ఏళ్ల తర్వాత ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi vacates govt-allotted bungalow


పరువు నష్టం కేసులో దోషిగా తేలి, ఎంపీగా అనర్హత వేటు పడిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. సమాచారం ప్రకారం.. ఆయ‌న‌ వస్తువులను ఇప్పటికే అధికారిక నివాసం నుండి 10 జన్‌పథ్‌లోని ఆయ‌న‌ తల్లి సోనియా గాంధీ ఇంటికి త‌ర‌లించిన‌ట్లు తెలుస్తోంది. అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "భారత ప్రజలు 19 సంవత్సరాల పాటు ఈ ఇంటిని నాకు ఇచ్చారు. నేను వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఇల్లు ఖాళీ చేయాల్సివ‌స్తోంది." ఈ రోజుల్లో నిజం మాట్లాడినందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. నిజం మాట్లాడినందుకు నేను ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధమేన‌ని అన్నారు.

'మోదీ ఇంటిపేరు' వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు దోషిగా తేలడంతో వయనాడ్ ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో.. ఏప్రిల్ 22లోగా తనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీని కోరింది. రాహుల్ గాంధీ ఏప్రిల్ 14న బంగ్లాలోని తన కార్యాలయం, కొన్ని వ్యక్తిగత వస్తువులను తన తల్లి సోనియా గాంధీ అధికారిక నివాసానికి మార్చారు. శుక్రవారం సాయంత్రం రాహుల్ గాంధీ.. మిగిలిన వస్తువులను బంగ్లా నుంచి తీసుకెళ్లిన‌ట్లు పీటీఐ తెలిపింది. రాహుల్‌ వస్తువులతో కూడిన ట్రక్కు భవనం నుండి బయలుదేరిందరి వెల్ల‌డించింది. రాహుల్ గాంధీ దాదాపు రెండు దశాబ్దాలుగా బంగ్లాలో నివసిస్తున్నారు. తన కార్యాలయాన్ని మార్చిన తర్వాత.. రాహుల్‌ తన తల్లి సోనియా గాంధీతో కలిసి 10-జన్‌పథ్ నివాసంలో ఉంటున్న‌ట్లు పీటీఐ వెల్ల‌డించింది.

మార్చి 23న సూరత్ కోర్టు రాహుల్‌ గాంధీని క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించింది. ఆయ‌న‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఎంపీ అభ్య‌ర్ధిత్వంపై అనర్హత వేటు ప‌డింది. రాహుల్ కోర్టు ఉత్తర్వును సవాలు చేసాడు. శిక్షను రద్దు చేయాలనే అతని అప్పీల్ ను కోర్టు తిరస్కరించింది. అనర్హత వేటు వేసిన ఒక రోజు తర్వాత లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీకి ఏప్రిల్ 22లోగా బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసు పంపింది.


Next Story