రాంచీలో నిర్వహించిన ఇండియా బ్లాక్ ర్యాలీలో పాల్గొనేందుకు సిద్ధమేనని చెప్పిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఊహించని విధంగా గైర్హాజరయ్యారు. అకస్మాత్తుగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆయన న్యూఢిల్లీ నుండి బయలుదేరలేరని ఆ పార్టీ నాయకుడు జైరాం రమేష్ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత రాంచీ ర్యాలీకి హాజరవుతారని రమేష్ తెలిపారు.
“ఇండియా ర్యాలీ జరుగుతున్న సాత్నా, రాంచీలలో రాహుల్ గాంధీ ఈరోజు ప్రచారానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతానికి న్యూఢిల్లీని విడిచిపెట్టలేరు, ”అని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ రమేష్ చెప్పారు. ఆప్ నుంచి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి ప్రతిపక్ష నాయకులు హాజరుకానున్నారు. ఖర్గేతో పాటు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన ఆదివారం రాంచీలో జరిగే ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొననున్నారు.