పెళ్లిపై రాహుల్ గాంధీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. పిల్ల‌లు కావాల‌ని ఉందంటూ

Rahul Gandhi reveals why is he still single at 52.కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీ వ‌య‌సు ఐదు ప‌దులు దాటింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Feb 2023 11:20 AM IST
పెళ్లిపై రాహుల్ గాంధీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. పిల్ల‌లు కావాల‌ని ఉందంటూ

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీ వ‌య‌సు ఐదు ప‌దులు దాటింది. ఆయ‌న పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు..? అన్న ప్ర‌శ్న ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో పాటు చాలా మంది అభిమానుల్లో ఉంది. అస‌లు పెళ్లి చేసుకుంటారా..? రాహుల్ మ‌దిలో ఏముంది..? అనేది ఎవ్వ‌రికి తెలీదు. పెళ్లిపై రాహుల్‌కు చాలా సార్లు ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. అయితే.. తాజాగా రాహుల్ గాంధీ దీనిపై స్పందించారు. అస‌లు ఇంత వ‌ర‌కు తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదో త‌న‌కే తెలియ‌ద‌ని అన్నారు. చాలా ప‌నులు చేయాల్సి ఉంద‌న్నారు. అయితే.. త‌న‌కు పిల్ల‌లు మాత్రం కావాల‌ని ఉందని చెప్పారు.

ఓ ఇటాలియన్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో రాహుల్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇంకా ఈ ఇంట‌ర్య్వూలో త‌న వ్య‌క్తిగ‌త, ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. తనకు భారతీయ నానమ్మ( ఇందిరా గాంధీ)తో ఎక్కువ చనువు ఉండేదనీ, తన సోదరి ప్రియాంక ఇటాలియన్ అమ్మమ్మ(పావోలా మైనో )తో ఎక్కువ చనువు ఉండేద‌న్నారు.

అలాగే భార‌త్ జోడో యాత్రకు సంబంధించిన విష‌యాల‌ను పంచుకున్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్లు మేర త‌న యాత్ర సాగింద‌న్నారు. పాద‌యాత్ర పూర్తి అయ్యే వ‌ర‌కు గ‌డ్డం తీయ‌కూడ‌ద‌ని భావించిన‌ట్లు తెలిపారు. ఇప్పుడు గ‌డ్డం తీయాల వ‌ద్దా అనేది ఇంకా నిర్ణ‌యించుకోలేద‌ని చెప్పారు.

Next Story