కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ జాతీయ మానిఫెస్టోను విడుదల చేశారు. ఐదు గ్యారెంటీల పేరుతో న్యాయ్ పత్ర్ పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను తుక్కుగూడ సభలో విడుదల చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తున్న సంక్షేమ పథకాల మాదిరిగానే కేంద్రంలో తమ ప్రభుత్వం రాగానే పలు కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోతోపాటు తెలంగాణకు 23 ప్రత్యేక హామీలు ప్రకటించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని రాహూల్ గాంధీ హామీ ఇచ్చారు.
నిరుపేద కుటుంబాలకు లక్ష ఆర్ధికసాయం, రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా కులాల వారిగా జనగణన చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పేద, బడుగు బలహీన వర్గాలకు చేయూతనిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. జనజాతర సభలో కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, దీపాదాస్ మున్నీ పాల్గొన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను న్యాయ పత్ర్ పేరుతో రాహుల్ విడుదల చేశారు.