బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ భారీ సాధించింది. అటువంటి పరిస్థితిలో రాజకీయ నాయకుల నుంచి స్పందన రావడం మొదలైంది. ఈ క్రమంలోనే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బీహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కూడా విరుచుకుపడ్డారు.
సీఎం శర్మ విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లినా బీజేపీ గెలుస్తుందని.. అలాగే బీహార్‌లో కూడా రాహుల్ గాంధీ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అని అన్నారు. ఆయన ఎక్కడ ప్రచారం చేసినా బీజేపీ గెలుస్తుంది. బీహార్‌లో రాహుల్ గాంధీని స్వాగతించినట్లే.. అస్సాంలో కూడా స్వాగతం పలుకుతామని సెటైర్లు సంధించారు.
అలాగే.. అసోంలోని ప్రతిపక్ష పార్టీలపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అవి కూడా తుడిచిపెట్టుకుపోతాయని అన్నారు.
ఈ సందర్భంగా ఎక్స్ పోస్టులో.. “గౌరవనీయమైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ, గౌరవనీయ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జీ నాయకత్వంలో బీహార్ ఒక అందమైన అభివృద్ధి, నమ్మకాన్ని చూస్తోంది. అసెంబ్లీలో ఎన్డీయే సాధించిన ఈ విజయం మన డబుల్ ఇంజన్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలకు అచంచల విశ్వాసం ఉందని స్పష్టం చేస్తోందని రాశారు.