ఓలా, ఒకినావా ఆటోటెక్‌కి చెందిన ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు) మంటల్లో చిక్కుకున్న వార్తలు ఓ వైపు వింటూ ఉండగా.. ఇప్పుడు తమిళనాడు రాజధాని చెన్నైలో ఇలాంటి సంఘటనే నివేదించబడింది. హైదరాబాద్ స్టార్టప్ ప్యూర్ ఈవీ సంస్థ తయారు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగడంతో ఈవీల భద్రతపై ఆందోళన మొదలైంది. ఉత్తర చెన్నైలోని నివాస ప్రాంతమైన మంజంపాక్కంలోని మాథుర్ టోల్ ప్లాజా సమీపంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నాయి. స్కూటర్ నుండి పొగలు వస్తూ ఉన్న వీడియో వైరల్ అవుతూ ఉన్నాయి.
26 సెకన్ల నిడివి గల వీడియోలో రోడ్డు పక్కన పార్క్ చేసిన రెడ్ కలర్ EVని చూడవచ్చు. నాలుగు రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది నాలుగోసారి. మార్చి 28న, పూణెలో ఓలా యొక్క S1 ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో చూపించింది. ఈ ఘటన జరిగినప్పుడు రోడ్డు పక్కనే ఈవీని పార్క్ చేశారు. ఓలా S1 ప్రో మిడ్‌నైట్ బ్లూ కలర్ వాహనంలో మంటలు చెలరేగడానికి ముందు కొంత పొగ కూడా వచ్చింది. చివరికి మంటల్లో చిక్కుకున్నట్లు అర నిమిషం వీడియోలో చూపించారు. ఓలా ఎలక్ట్రిక్ ఈ సంఘటనపై స్పందించింది. సమస్యను పరిశీలిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే రోజుల్లో విచారణ ముగిసిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని కంపెనీ హామీ ఇచ్చింది.
గత సంవత్సరం ఓలా కంపెనీ Ola S1 ప్రో మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ప్రారంభించారు. దీనితో పాటు Ola S1 కూడా ప్రారంభించబడింది. ఒకినావా ద్విచక్ర వాహనం తగలబడిన ఘటన తమిళనాడులోని వేలూరులో చోటుచేసుకుంది.