చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేరగా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయిన ఓ ఖైదీని కర్ణాటక రాష్ట్రం చిక్ మంగళూరు జిల్లాలోని కడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని కడూరు తాలూకాకు చెందిన ధనరాజ్‌ను గంజాయి కేసులో కడూరు పోలీసులు అరెస్టు చేశారు. మాలెగౌడ జిల్లా కోర్టులో విచారణ ఖైదీ అయిన ధనరాజ్ ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధనరాజ్ టాయిలెట్‌కు వెళ్లాలని కోరాడు.
ఆసుపత్రిలో గార్డు కూడా అతడితో పాటూ టాయ్ లెట్ దాకా వెళ్ళాడు. నిందితుడు ధనరాజ్ టాయిలెట్‌లోకి వెళ్లి గార్డును అదే టాయిలెట్‌లోకి తోసేశాడు. ఖైదీ ధనరాజ్ ను జైలు గార్డులు, పోలీసులు వెతకడం ప్రారంభించాడు. షిమోగా తాలూకా కునిలో ధన్‌రాజ్ ఉన్నాడని జైలు గార్డులు, పోలీసులు నిర్ధారించారు. నిందితుడి వద్ద మొబైల్ లేకపోయినా ట్రాకింగ్ చేసిన పోలీసులు 48 గంటల్లోనే అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యను ఎస్పీ అక్షయ్ కూడా అభినందించారు. ఈ ఆపరేషన్ లో కడూరు పి.ఎస్.ఐ రమ కూడా పాల్గొన్నారు.-