భారత ప్రధాని నరేంద్ర మోడీ రోమ్‌లో పర్యటిస్తున్నారు. జీ-20 సదస్సులో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన మోడీ.. పియాజా గాంధీ వద్ద మహాత్మ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ప్రపంచానికి గాంధీ అందించిన స్పూర్తి కొనసాగుతుందని మోడీ అన్నారు. రోమ్‌లో దాదాపు 60 గంటల పాటు మోడీ ఉంటారు. మోడీ తన పర్యటనలో వివిధ దేశాల అధినేతలు, నేతలతో సమావేశంకానున్నారు. సింగపూర్, స్పెయిన్, ఇటలీ ప్రైమ్ మినిస్టర్లు, జర్మనీ ఛాన్సలర్, ఫ్రాన్స్, ఇండోనేషియా ప్రెసిడెంట్‌లతో మోడీ భేటీ అవుతారు. అలాగు యూరోపియన్ యూనియన్, యూరోపియన్ కౌన్సిల్ చీఫ్‌లతో ప్రధాని మోడీ భేటీ అవుతారు. రోమ్ పర్యటనలో ప్రధాని మోడీ, పోప్ ఫ్రాన్సిస్‌ల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
అక్టోబర్ 30న ఉదయం సమయంలో పోప్ ఫ్రాన్సిస్‌తో మోడీ భేటీ కానున్నారు. 'కార్డినల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్'గా పిలిచే వాటికన్‌లో పోప్ ముఖ్య సలహాదారున్ని కూడా మోడీ కలుసుకుంటారు. రోమ్‌లో భారత ప్రధాని మోడీకి స్థానికుల నుండి మంచి స్పందన వచ్చింది. రోమ్ రోడ్లపైకి వచ్చిన ఇండియన్స్ మోడీ.. మోడీ అంటూ నినాదాలు చేశారు. రోమ్‌లో దాదాపు 12 ఏళ్ల తర్వాత పర్యటిస్తున్న భారత తొలి ప్రధాని మోడీ. జీ20 సదస్సు తర్వాత ప్రధాని మోడీ అక్కడి నుండి యూకేకు వెళ్తారు. యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని బోరిన్ జాన్సన్ ఇన్విటేషన్ మేరకు నవంబర్ 1వ తేదీన జరిగే కాప్ 26 మీటింగ్‌లో పాల్గొంటారు మోడీ. యూకే పర్యటనలో బోరిస్‌తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. ప్రధాని నవంబర్ 3వ తేదీన ఉదయం ఢిల్లీకి చేరుకుంటారు.