ఉత్తరాఖండ్‌కు ప్రధాని వరాల జ‌ల్లు.. రూ. రూ.17,500 కోట్లతో..

Prime Minister Modi in Uttarakhand Live Updates. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌కు వరాల వ‌ర్షం కురిపించారు

By Medi Samrat  Published on  30 Dec 2021 4:21 PM IST
ఉత్తరాఖండ్‌కు ప్రధాని వరాల జ‌ల్లు.. రూ. రూ.17,500 కోట్లతో..

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌కు వరాల వ‌ర్షం కురిపించారు. వీటిలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంతోపాటు.. రూ.17,500 కోట్ల విలువైన మరో 23 ప్రాజెక్టులను కూడా ప్రారంభించ‌నున్నారు. ఈ 23 ప్రాజెక్టులలో ముఖ్యంగా ఎయిమ్స్‌, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో రిషికేశ్ శాటిలైట్ సెంటర్, పితోర్‌ఘర్‌లోని జగ్జీవన్ రామ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఉన్నాయి. 2012లో రిషికేశ్‌లో ఏర్పాటైన ఎయిమ్స్‌ తర్వాత.. తాజాగా మరో ఎయిమ్స్ ను రాష్ట్రానికి కేటాయించారు.

నైనిటాల్‌తో సహా సమీప జిల్లాల నుంచి భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోదీ స‌మావేశస్థలికి చేరుకుంటున్నారు. ఉత్తరాఖండ్‌లో 17,500 కోట్ల రూపాయల విలువైన 23 అభివృద్ధి పథకాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయ‌నున్నారు. 23 ప్రాజెక్టుల్లో రూ.14,100 కోట్లతో 17 ప్రాజెక్టులకు రూప‌క‌ల్ప‌న చేస్తారు.

ప్రాజెక్టులు నీటిపారుదల, రోడ్లు, నివాస ఆరోగ్య మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి అనేక రంగాలకు సంబంధించినవి. దీంతోపాటు రోడ్డు విస్తరణ ప్రాజెక్టులు, పితోర్‌ఘర్‌లో జలవిద్యుత్ ప్రాజెక్ట్, నైనిటాల్‌లో మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచడానికి సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.3,400 కోట్లు. కార్మికులనుద్దేశించి ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి మాట్లాడుతూ.. అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఉత్తరాఖండ్‌ అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.


Next Story