జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు

కేంద్రప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ఉపసంహరించబడింది.

By Medi Samrat
Published on : 14 Oct 2024 2:31 AM

జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు

కేంద్రప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ఉపసంహరించబడింది. కేంద్ర పాలిత ప్రాంతంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో సమావేశమై జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరిన తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

జూన్ 19, 2018న PDP-BJP కూటమి కూలిపోవడంతో జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో రాష్ట్రపతి పాలన విధించారు. ఇక 2019లో, ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసింది. రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది. నేషనల్ కాన్ఫరెన్స్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా ఒమర్ అబ్దుల్లా గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంగా ఉన్న 2009 నుండి 2014 వరకు NC-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉంది. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడమే కొత్త ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు.

Next Story