పొలిటికల్ హీట్ పెంచుతున్న ప్రశాంత్ కిషోర్

Prashant Kishor reiterates prediction on BJP's seats in Bengal. ప్రశాంత్ కిషోర్.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమత విజయం

By Medi Samrat
Published on : 27 Feb 2021 3:27 PM IST

పొలిటికల్ హీట్ పెంచుతున్న ప్రశాంత్ కిషోర్

ప్రశాంత్ కిషోర్.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమత విజయం కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్నారు. ఆయనకు చెందిన ఐప్యాక్ సంస్థ ఎన్నికల్లో దీదీ పార్టీ గెలుపుకోసం వ్యూహాలు, ప్రతి వ్యూహాలను రచిస్తోంది. 'బెంగాల్ తన సొంత కూతురునే కోరుకుంటోంది' అనే నినాదంతో మమత పార్టీ ప్రచారం మొదలుపెట్టేసింది. మమత పార్టీ గెలుపుపై ప్రశాంత్ కిశోర్ ధీమా వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ.. ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న కీలక యుద్ధాల్లో ఒకటి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో జరుగుతోందని అన్నారు.

'బెంగాల్ తన సొంత కూతురునే కోరుకుంటోంది' అనే సందేశంతో రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మే 2వ తేదీన తన చివరి ట్వీట్ చూసేందుకు సిద్ధంగా ఉండండి అని ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. వెస్ట్ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని తగ్గించాలని భారతీయ జనతా పార్టీ ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పటికే చాలామంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తమ వైపు తిప్పేసుకుంది.


అస్సోం, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా శుక్రవారం ప్రకటించారు. 294 స్థానాలతో అతిపెద్ద అసెంబ్లీగా ఉన్న పశ్చిమబెంగాల్‌లో మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27, ఏప్రిల్‌ 1, 6, 10, 17, 22, 26, 29 పోలింగ్ చేపట్టనున్నారు. 8 విడతల్లో జరిగే ఈ ఎన్నికలకు లక్షకు పైగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడమే కాకుండా.. రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ కూడా పెరుగుతూ ఉంది.




Next Story