దీపావళి పండుగ దృష్ట్యా జమ్మూ డివిజన్‌లోని అన్ని పాఠశాలలు అక్టోబర్ 29 (మంగళవారం) నుండి నవంబర్ 2 (శనివారం) వరకు ఐదు రోజుల పాటు మూతపడనున్నాయి. జమ్మూ మరియు కాశ్మీర్ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఆర్డర్ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, హయ్యర్ సెకండరీ స్థాయి వరకూ వర్తిస్తుందని పేర్కొంది.
జమ్మూ డివిజన్‌లోని అన్ని విద్యా సంస్థలు హయ్యర్ సెకండరీ స్థాయి వరకూ.. అన్ని ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థలు 29-10-2024 నుండి 02-11-2024 వరకూ ఐదు (5) రోజుల పూజా సెలవులను పాటించాలని ఇందుమూలంగా ఆదేశించబడిందని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్డర్ పేర్కొంది. దీపావళి వేడుకల దృష్ట్యా ఇతర రాష్ట్రాలు కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని భావిస్తున్నాయి. దానా తుఫాను కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. తెలంగాణలోనూ దీపావళి రోజున సెలవు ప్రకటించారు.