బీహార్ : బిలాస్‌పూర్ జిల్లా కోర్టులో విచిత్రమైన కేసుకు సంబంధించిన విషయం బయట పడింది. బంగ్లాదేశ్ ఖైదీని బిలాస్‌పూర్ సెంట్రల్ జైలు నుండి జిల్లా కోర్టుకు తీసుకెళ్లారు. ఆ సమయంలో అతని చేతికి సంకెళ్ళు తీసివేయగానే అతను వెంటనే పారిపోయాడు. పోలీసులు అతడిని పట్టుకోడానికి చాలానే ప్రయత్నించారు. అయితే అతడిని పట్టుకోడానికి జరిగిన ఘటనల్లో నిందితుడికి గాయాలు అయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న నిందితుడిని ఆసుపత్రిలో చేర్చారు. ఖైదీ బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి అని, అతని పేరు ఇమ్రాన్ అని తెలుస్తోంది. దొంగతనం కేసులో పడిన శిక్ష కారణంగా బిలాస్‌పూర్ జైలులో అతడిని ఉంచారు. మంగళవారం అతడికి కండరాలు పట్టుకున్నందున ఇతర ఖైదీలతో పాటు అతడిని కూడా జైలు ఆవరణ నుంచి జిల్లా కోర్టుకు తరలిస్తున్నారు.
పోలీసులు ఇమ్రాన్‌ను కోర్టు లోపలికి తీసుకెళ్లారు, ఆపై అక్కడి నుండి తిరిగి వచ్చారు. ఆ సమయంలో మరొక వ్యక్తికి సంకెళ్లు వేయవలసి వచ్చింది. ఇమ్రాన్ కు ఎలాగూ కండరాలు పట్టుకున్నాయి కదా.. ఎక్కడికీ వెళ్ళడేమోనని ఇమ్రాన్ కు ఉన్న సంకెళ్లను తీసేసారు. అయితే వెంటనే ఇమ్రాన్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించే క్రమంలో కిందపడిపోయాడు.. స్పృహతప్పాడు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉంది. దీంతో అతడిని మళ్లీ జైలుకు పంపారు. జిల్లా కోర్టులో అండర్ ట్రయల్ ఖైదీ పారిపోయాడన్న వార్త తెలియగానే జిల్లా కోర్టు ఆవరణలో ఆందోళన మొదలైంది. నిందితుల భద్రతపై న్యాయవాదులు ప్రశ్నించారు. నిందితుడిని ఎట్టకేలకు పట్టుకోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.