ఎవరిని పడితే వారిని ఇష్టమొచ్చినట్లు తిడితే కటకటాల పాలవ్వక తప్పదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై అసభ్య పదజాలంతో దూషణలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు బీహార్ పోలీసులు. నిందితుడు సింగ్వారాలోని బాపుర గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దర్భంగాలో ఇండియా కూటమి నిర్వహించిన రాజకీయ సభలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మోదీ, ఆయన తల్లిపై చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఖండించారు. ఇది 140 కోట్ల మంది భారతీయులను అవమానించడమేనని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో ఈ ఘటన జరిగింది. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేశారు.