నిషేధిత ఉగ్రవాద సంస్థలు రెసిస్టెన్స్ ఫ్రంట్ ( టిఆర్‌ఎఫ్) లష్కరే తొయిబా (ఎల్‌ఇటి)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి 15 పిస్టల్స్, 30 మ్యాగజైన్లు, 300 రౌండ్లు బుల్లెట్లు, సైలెన్సర్ స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్ ఐజి విజయ్ కుమార్ తెలిపారు. నిందితులపై సంబంధిత సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ఇద్దరు స్థానిక 'హైబ్రిడ్' ఉగ్రవాదులని తెలుస్తోంది. సోమవారం శ్రీనగర్ నగరంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో సహా వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 'హైబ్రిడ్' టెర్రరిస్టులు వీరని పోలీసులు తెలిపారు. తీవ్రవాద దాడిని నిర్వహించి, ఆపై సాధారణ ప్రజలుగా జీవిస్తూ ఉంటారు.