నేడు ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న‌ నీతి ఆయోగ్ సమావేశం.. కేసీఆర్ డుమ్మా.. అదే బాట‌లో మ‌రో సీఎం..!

PM to chair NITI Aayog meet today. ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ ఏడో పాలక మండలి

By Medi Samrat  Published on  7 Aug 2022 9:29 AM IST
నేడు ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న‌ నీతి ఆయోగ్ సమావేశం.. కేసీఆర్ డుమ్మా.. అదే బాట‌లో మ‌రో సీఎం..!

ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ ఏడో పాలక మండలి సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. "స్థిరమైన, సమ్మిళిత భారతదేశాన్ని నిర్మించే దిశగా కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సహకారానికి మార్గం సుగమం చేయడం" ఈ సమావేశం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ కీలక సమావేశాన్ని తాను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం, సమానంగా చూడకపోవడం పట్ల నిరసనగా నేను సమావేశానికి దూరంగా ఉంటున్నానని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. కేసీఆర్ సమావేశాన్ని దాటవేయాలని నిర్ణయించుకోవడం "దురదృష్టకరం" అని కేంద్ర‌ ప్రభుత్వం పేర్కొంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఈ స‌మావేశానికి హాజ‌రుకాలేక పోతున్నార‌ని జాతీయ మీడియా సంస్థ‌లు పేర్కొన్నాయి. అంతకుముందు రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ముకి మోదీ ఇచ్చిన విందుకు కూడా నితీష్ కుమార్ గైర్హాజరయ్యారు.


Next Story