ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.. అయినా కూడా..!

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా భారత్‌లో వెలుగుచూసిన ఎల్పీజీ కొరతపై జనం భయపడాల్సిన పనిలేదని ప్రధాని మోదీ ప్రజలకు భరోసా ఇచ్చారు.

By -  Medi Samrat
Published on : 12 March 2026 3:40 PM IST

ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.. అయినా కూడా..!

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా భారత్‌లో వెలుగుచూసిన ఎల్పీజీ కొరతపై జనం భయపడాల్సిన పనిలేదని ప్రధాని మోదీ ప్రజలకు భరోసా ఇచ్చారు. ముఖ్యంగా పుకార్లకు ప్రజలు ప్రాధాన్యత ఇవ్వొద్దన్నారు ప్రధాని మోదీ. తమిళనాడులో ఎన్‌డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసులు దెబ్బతిన్నాయని, ఎలాంటి సంక్షోభకాలంలోనైనా భారతీయుల స్వప్రయోజనాలకే మా ప్రభుత్వం సదా కట్టుబడి ఉంటుందని అన్నారు ప్రధాని మోదీ.

ప్రస్తుత కష్టకాలంలో భారత్ విధానం మారదని, ఇప్పుడు ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదన్నారు. కోవిడ్‌ మహావిలయకాలంలోనూ భారత్‌ ఎంత పరిణతి చెందిన దేశమో 140 కోట్ల మంది భారతీయులు రుజువుచేశారన్నారు. అయితే.. పెట్రోల్, డీజిల్ ధరలపై సామాన్యులు భయపడుతున్నారు. ఈ ధరలు రానున్న కొన్ని రోజుల్లో విపరీతంగా పెరుగుతాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పెట్రోలియం మంత్రిత్వ శాఖ‌, ప్ర‌ధాన మంత్రి స్పందించారు.

Next Story