ప్రధాని పంజాబ్ పర్యటన భద్రతా లోపాలపై నేడు సుప్రీంలో విచారణ
PM Modi’s security breach in Punjab Supreme Court to hear plea seeking thorough probe today. ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న
By Medi Samrat Published on 7 Jan 2022 3:57 AM GMTప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భద్రతాపరమైన ఉల్లంఘనలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను భారత అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారించనుంది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు వెళ్లే మార్గంలో ప్రధాని మోదీ భద్రతలో భారీ ఉల్లంఘన జరిగిందని, దీంతో ఆయన కాన్వాయ్ బటిండా సమీపంలోని ఫ్లై ఓవర్‌పై 15 నుంచి 20 నిమిషాలు చిక్కుకుపోయిందని సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ చేసిన విజ్ఞప్తిని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.
సుప్రీం న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై అత్యవసర విచారణ కోసం గురువారం స్వీకరించింది. "రాష్ట్ర ప్రభుత్వానికి (పిటీషన్ కాపీని) అందజేయండి. మేము దానిని రేపు మొదటి అంశంగా తీసుకుంటాము" అని పేర్కొంది.
ప్రధాని మోదీ పర్యటనకు ముందు రాష్ట్ర పోలీసు బలగాలు చేసిన భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అందుబాటులో ఉన్న అన్ని సాక్ష్యాలను స్వాధీనం చేసుకునేలా భటిండా జిల్లా న్యాయమూర్తికి ఆదేశాలు జారీ చేయాలని సింగ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పంజాబ్‌లోని పరిస్థితుల దృష్ట్యా, లోపభూయిష్టంగా మరియు జవాబుదారీతనంపై న్యాయమైన విచారణ జరగాలని.. తద్వారా భవిష్యత్తులో అలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ఉంటుందని సీనియర్ న్యాయవాది పేర్కొన్నారు.
"మీరు మా నుండి ఏమి ఆశిస్తున్నారు?" అని బెంచ్ ప్రశ్నించింది. "అలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము.. న్యాయస్థానం పర్యవేక్షణలో పోలీసు బందోబస్త్‌పై వృత్తిపరమైన, సమర్థవంతమైన దర్యాప్తు అవసరం. ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని బట్టి చూస్తే సరిపోతుంది. రికార్డును జిల్లా న్యాయమూర్తి తీసుకోవాలని.. ఆ తర్వాత మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించవచ్చని.. దయచేసి ఈరోజే ఉత్తర్వులు జారీ చేయడాన్ని పరిశీలించండి" అని ప్రభుత్వం తరపున న్యాయవాది అన్నారు.