మోదీ కేబినెట్.. కోటీశ్వరుల శాతం ఎంతో తెలుసా..?
PM Modi’s new Council of Ministers 90% are millionaires. భారత ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ లో ఇటీవలే మార్పులు చేసిన సంగతి
By Medi Samrat Published on 11 July 2021 5:34 PM IST33 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నట్లు వెల్లడించింది. వీళ్లలో 24 మందిపై హత్య, హత్యాయత్నం, దోపిడీ వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. కొత్త కేబినెట్‌లో 70 మంది మంత్రులు కోటీశ్వరులే అని కూడా ఏడీఆర్ రిపోర్ట్ స్పష్టం చేసింది. వీళ్ల కనీస సంపద రూ.కోటిపైనే ఉన్నట్లు అఫిడవిట్లలో చూపించారు. నలుగురు మంత్రుల ఆస్తులు రూ.50 కోట్ల కంటే ఎక్కువ ఉన్నట్లు కూడా ఏడీఆర్ తెలిపింది. జ్యోతిరాదిత్య సింధియా (రూ.379 కోట్లు) తొలిస్థానంలో ఉండగా.. పియూష్ గోయల్ (రూ.95 కోట్లు), నారాయణ్ రాణె (రూ.87 కోట్లు), రాజీవ్ చంద్రశేఖర్ (రూ.64 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అతి తక్కువ ఆస్తులున్నట్లు చూపించిన వాళ్లలో త్రిపురకు చెందిన ప్రతిమా భౌమిక్ (రూ.6 లక్షలు), పశ్చిమ బెంగాల్ నుంచి జాన్ బార్లా (రూ.14 లక్షలు), రాజస్థాన్ నుంచి కైలాష్ చౌదరి (రూ.24 లక్షలు), ఒడిశా నుంచి బిశ్వేశ్వర్ తుడు (రూ.27 లక్షలు), మహారాష్ట్ర నుంచి వి. మురళీధరన్ (రూ.27లక్షలు) ఉన్నారు.