భారతదేశంలో ఎన్నికల సందడి ప్రస్తుతం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పోలింగ్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ర్యాలీ సందర్భంగా ఉన్నావ్ జిల్లా అధ్యక్షుడి పాదాలను పీఎం మోదీ తాకడం కనిపించింది. బీజేపీ ఉన్నావ్ జిల్లా అధ్యక్షుడు అవధేష్ కతియార్ పాదాలను తాకడానికి ప్రధాని మోదీ నమస్కరిస్తున్నట్లు వీడియోలో కనిపించింది. బీజేపీ నాయకుడు సంబిత్ పాత్రా ప్రధానిని ప్రశంసిస్తూ ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ఆయన చర్య చాలా మందికి చేరింది.
ప్రధాని మోదీ కతియార్ పాదాలను తాకడం వెనుక కారణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. సభలో బీజేపీ యూపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్.. ఉన్నావ్ జిల్లా అధ్యక్షుడు అవధేష్ కతియార్‌ను శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధానికి బహూకరించాలని కోరారు. ఈ సమయంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. పోలింగ్ ర్యాలీకి ప్రధాని మోదీ రావడంతో ఈ ఘటన జరిగింది. అక్కడ బీజేపీ యూపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్, బీజేపీ ఉన్నావ్ జిల్లా అధ్యక్షుడు అవధేష్ కతియార్ ను రాముడి విగ్రహాన్ని బహూకరించాలని కోరారు. ఆ సమయంలో అవధేష్ కతియార్ ప్రధాని మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలో ప్రధాని నరేంద్రమోదీ ఇలా చేయవద్దంటూ ఆయనకు సూచించారు. అనంతరం ఆయనకే తిరిగి నమస్కారం చేస్తూ ప్రధాని మోదీ కనిపించారు.