ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మధ్యాహ్నం గుజరాత్‌లోని మోర్బీలో సస్పెన్షన్ బ్రిడ్జి ప్రాంతానికి వెళ్లనున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో చూసిన అతిపెద్ద విపత్తులలో ఇదొకటిగా మిగిలింది. ఆదివారం సాయంత్రం రద్దీగా ఉండే వేలాడే వంతెన కూలిపోయింది. ఎంతో మంది కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది. ఈ సంఘటన జరగడానికి కొన్ని గంటల ముందు, వడోదరలో టాటా-ఎయిర్‌బస్ తయారీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. మోర్బీ జిల్లాలో విషాదం చోటుచేసుకోవడంతో, సహాయక చర్యలను సమీకరించాలని ఆయన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ను కోరారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో మంగళవారం ప్రధాని మోదీ పర్యటన ఉంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం తెలిపింది.
కేబుల్ బ్రిడ్జిపై వెళ్లడానికి కేవలం 125 మందికి మాత్రమే అనుమతి ఉంది. కానీ, కెపాసిటికీ మించి సందర్శకులను పంపించారు నిర్వాహకులు. ఏకంగా 500 మందిని అనుమతించడంతోనే ఈ ప్రమాదం జరిగింది. సందర్శకుల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ. 17 చోప్పునర వసూలు చేసి బ్రిడ్జి పైకి అనుమతి ఇచ్చినట్లు విచారణలో తేలింది. పాత బ్రిడ్జిని మరమ్మతులు చేసిన అనంతరం సందర్శకుల అనుమతికి మున్సిపల్, ఫైర్ సిబ్బంది నుంచి సేఫ్టీ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదని తెలుస్తోంది.