బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కిఐఏ)లో 108 అడుగుల కెంపేగౌడ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 11న ఆవిష్కరిస్తారని కర్ణాటక మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్ బుధవారం నాడు తెలిపారు. అదే రోజు విమానాశ్రయం టెర్మినల్ 2ను కూడా మోదీ ప్రారంభించనున్నారు. నారాయణ్ మాట్లాడుతూ.. ''కెంపేగౌడ విగ్రహం కర్ణాటక ప్రజల చిరకాల డిమాండ్. బెంగళూరు వ్యవస్థాపకుడు కెంపేగౌడ దృష్టిలో బెంగళూరు సాధించిన ప్రగతిని ప్రతిబింబించేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నాం" అని అన్నారు.
23 ఎకరాల విస్తీర్ణంలో, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద థీమ్ పార్క్ రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశ తొమ్మిది నెలల్లో పూర్తవుతుంది. ఇందుకోసం రూ. 20 కోట్లు మంజూరయ్యాయని నారాయణ తెలిపారు. ఈ పార్క్‌లో యాంఫీథియేటర్, పాత్‌వే, సబ్‌వే, A V ఎగ్జిబిషన్ సిస్టమ్, 3D ప్రొజెక్షన్, ఫౌంటెన్, ఫ్లవర్ గార్డెన్, VIP లాంజ్, రెస్ట్‌రూమ్‌లు, పెవిలియన్‌లు మొదలైనవి ఉంటాయి.