భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడతారంటూ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియ గురించి కూడా ప్రధాని మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. మోదీ ఏమి చెప్తారా అనే ఆసక్తి ప్రజల్లో మొదలైంది.

దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి.. వ్యాక్సిన్ల కొరతపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. వ్యాక్సిన్‌ విధానం, టీకాల కొరతపై రాష్ట్రాలు, నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో వీటిపై కూడా ప్రధాని మోదీ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే టీకా ధరలు, వ్యాక్సిన్‌ పంపిణీపై ఇటీవల సుప్రీంకోర్టు కూడా కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.


సామ్రాట్

Next Story