కాన్వాయ్‌ను ఆపి.. అంబులెన్స్‌కు దారిచ్చిన ప్ర‌ధాని మోదీ

వారణాసిలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు కాశీ చేరుకున్నారు.

By Medi Samrat  Published on  17 Dec 2023 3:50 PM GMT
కాన్వాయ్‌ను ఆపి.. అంబులెన్స్‌కు దారిచ్చిన ప్ర‌ధాని మోదీ

వారణాసిలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు కాశీ చేరుకున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ కాన్వాయ్ విమానాశ్రయం నుండి నగరం వైపు బయలుదేరిన స‌మ‌యంలో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. గిలాత్ బజార్ దగ్గరకు రాగానే ప్రధాని మోదీ త‌న‌ కాన్వాయ్‌ వెనుక నుంచి వస్తున్న అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఇందుకై ప్రధాని తన కాన్వాయ్‌ను పక్కకు నిలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల స‌మ‌యంలో వారణాసిలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది.

ప్రధాని మోదీ రెండు రోజుల వారణాసి పర్యటనకు వెళ్లారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయన పూర్వాంచల్‌లో రూ.19,000 కోట్లకు పైగా విలువైన 37 ప్రాజెక్టులను ప్రారంభించి, ప్రారంభోత్సవం చేయనున్నారు. నమో ఘాట్ నుండి కాశీ తమిళ సంగమం 2.0ని కూడా ఆయన ప్రారంభిస్తారు. దీంతో పాటు కన్యాకుమారి నుంచి వారణాసి వరకు కొత్త రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు.

Next Story