కాంగ్రెస్ మాయం కాబోతోంది

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం భరత్ పుర్‌లో నిర్వహించిన సభలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు.

By Medi Samrat  Published on  18 Nov 2023 3:18 PM IST
కాంగ్రెస్ మాయం కాబోతోంది

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం భరత్ పుర్‌లో నిర్వహించిన సభలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పై ధ్వజమెత్తారు. డిసెంబర్ 3వ తేదీన కాంగ్రెస్ పార్టీ మాయమైపోవడం ఖాయం అని మోదీ అన్నారు. అవినీతి, అల్లర్లు, నేరాల పట్ల రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని, నేరస్థులకు స్వేచ్ఛనిస్తోందని అన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ పార్టీ తన స్వలాభం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేందుకు సైతం వెనుకాడదని, కాంగ్రెస్ పాలనలో రాళ్ల దాడి, కర్ఫ్యూ, అల్లర్ల కారణంగా రాజస్థాన్ ప్రజలు హోలీ, రామనవమి, హనుమాన్ జయంతి మరే ఇతర పండుగను శాంతియుతంగా జరుపుకోలేకపోయారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు మోదీ.

రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ ఒక జాదూగర్ అని అన్నారు. నవంబర్ 25న రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Next Story