కాశీ విశ్వనాథ్ కారిడార్ ఉద్యోగులకు ఊహించ‌ని గిప్ట్ పంపిన‌ ప్రధాని

PM Modi sends special gift to Kashi Vishwanath Dham employees. కాశీ విశ్వనాథ్ కారిడార్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ

By Medi Samrat  Published on  10 Jan 2022 4:30 PM IST
కాశీ విశ్వనాథ్ కారిడార్ ఉద్యోగులకు ఊహించ‌ని గిప్ట్ పంపిన‌ ప్రధాని

కాశీ విశ్వనాథ్ కారిడార్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక బహుమతి పంపారు. వాస్తవానికి, ఆలయ సిబ్బంది చెప్పులు ధరించడం నిషేధం. దీంతో వారు చలికాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు ప్రధాని మోదీ జనపనారతో తయారు చేసిన పాదరక్షలను పంపారు. విశ్వనాథుని సేవలో నిమగ్నమైన పూజారులు, సేవకులు, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఇతరులకు 100 జతల పాదరక్షలు పంపారు. కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ గత నెలలో కాశీలో ప‌ర్య‌టించారు.

కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోదీ అక్కడ కూర్చుని కార్మికులతో కలిసి విందు చేశారు. మోదీ తన కుర్చీని వదిలి కార్మికులతో కూర్చుని గ్రూప్‌ ఫొటో దిగారు. ప‌ర్య‌ట‌న‌ను దృష్టిలో ఉంచుకున్న మోదీ ఉద్యోగుల‌కు జూట్ పాదరక్షలను కానుకగా పంపారు. అధికారిక వర్గాల ప్రకారం.. ఆలయంలో ఉద్యోగులు చెప్పులు లేకుండా పని చేస్తారు. ఈ రోజుల్లో చాలా చలిగా ఉంటుంది. ఆ ప్రజల సౌకర్యార్థం తన తరపున ఈ చిన్న బహుమతి ఇవ్వాలని ప్రధాని మోదీ నిర్ణయించారు.

కాశీ విశ్వనాథ్ కారిడార్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు.. ప్రధాని మోదీ నుండి ఈ ఊహించ‌ని బహుమతిని అందుకోవడంతో చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇది ప్రధాని మోదీ సాధారణ ప్రజల సమస్యలను అర్థం చేసుకునే తీర‌ని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణం తర్వాత బాబా విశ్వనాథ్ ధామ్ లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. శుభ్రత‌, భక్తుల నిలుపుదల వంటి అనేక విషయాల్లో మార్పులు జ‌రిగాయి. కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రధాని మోదీ కలల ప్రాజెక్ట్‌గా పరిగణిస్తారు. దాని పనులను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.


Next Story