ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను స్మరించుకున్న ప్రధాని మోదీ

PM Modi remembers Chhatrapati Shivaji Maharaj on his birth anniversary. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

By Medi Samrat  Published on  19 Feb 2022 10:36 AM IST
ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను స్మరించుకున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. సామాజిక సంక్షేమానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత తరతరాలుగా ప్రజలకు స్పూర్తిగా నిలుస్తోందని అన్నారు. ''ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి సందర్భంగా ఆయనకు నమస్కరిస్తున్నాను. ఆయన విశిష్ట నాయకత్వం, సాంఘిక సంక్షేమానికి ఇచ్చిన‌ ప్రాధాన్యత తరతరాలుగా ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. సత్యం, న్యాయం యొక్క విలువల కోసం నిలబడే విషయంలో ఆయ‌న‌ రాజీపడలేదు. ఆయన దార్శనికతను నెరవేర్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం'' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఛత్రపతి శివాజీ ఫిబ్రవరి 19, 1630న పూణేలోని శివనేరి కోటలో జన్మించారు.


Next Story