చివరికి పాకిస్థాన్ భారత్ కాళ్ల మీద పడింది : ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో, ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం ఒక పేరు కాదని, కోట్లాది మంది మనోభావాల ప్రతిబింబమన్నారు

By Medi Samrat
Published on : 12 May 2025 8:15 PM IST

చివరికి పాకిస్థాన్ భారత్ కాళ్ల మీద పడింది : ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో, ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం ఒక పేరు కాదని, కోట్లాది మంది మనోభావాల ప్రతిబింబమన్నారు. న్యాయం కోసం భారత్ చేసిన ప్రతిజ్ఞ అని కొనియాడారు. ఉగ్రవాదులను అంతమొందించడానికి భారత దళాలకు స్వేచ్ఛగా అవకాశం ఇచ్చామని అన్నారు. అన్ని ఉగ్రవాద శిబిరాలు భారత్ లోని కుమార్తెలు, సోదరీమణుల నుండి 'సిందూర్'ను తుడిచిపెట్టడం వల్ల కలిగే ఫలితాన్ని అర్థం చేసుకున్నాయని ప్రధాని మోదీ అన్నారు.

భారత్ ను దెబ్బతీయడానికి పాకిస్థాన్ చాలా ప్రయత్నాలు చేసిందని, భారతదేశంలోని సాధారణ ప్రజలను కూడా టార్గెట్ చేయాలని చూసిందని అన్నారు ప్రధాని మోదీ. చివరికి పాకిస్థాన్ ప్రయత్నాలు ఫలించకపోవడం, ప్రపంచ దేశాల నుండి మద్దతు రాకపోవడంతో చివరికి భయపడిపోయిందని కాల్ చేసిందని చెప్పారు. ఇంకోసారి ఉగ్రవాద దాడి జరిగితే ఆ ప్రాంతాలను తప్పకుండా చేస్తామని హెచ్చరించారు. న్యూక్లియర్ దాడి చేస్తామని బెదిరిస్తే భయపడే స్థితిలో భారత్ లేదని ప్రధాని తేల్చి చెప్పారు. తీవ్రవాదులను వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో హతమైన తీవ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్థాన్ నేతలు సిద్ధమయ్యారని, ఇది ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రతి యుద్ధంలోనూ పాకిస్థాన్ కు చుక్కలు చూపించామని, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లో న్యూ ఏజ్ వార్ లో కూడా సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పామన్నారు. మేడిన్ ఇండియా డిఫెన్స్ ఎక్విప్మెంట్ అద్భుతంగా పని చేశాయని ప్రధాని మోదీ తెలిపారు. మనమంతా కలిసి ఉండడమే అసలైన శక్తి అని అన్నారు.

Next Story